అమెరికాలో ఓ నిందితుని కోసం పోలీసులు 24 గంటల సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. దాంతో ఆ చుట్టుపక్కలకు ఎవరూ రాకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అంత సీరియస్ గా జరుగుతున్న ఆపరేషన్ మధ్యలోకి ఓ అమెజాన్ డెలివరీ బాయ్ మాత్రం మీరేమి చేస్తే నాకేంటి..నా కర్తవ్యం నేను చేసుకుంటా అని తన డ్యూటీ తాను చేసేశాడు… పార్శిల్ ఇచ్చేసి అందరితో ప్రశంసలు అందుకుంటున్నాడు.
అసలేం జరిగిందంటే…అమెరికాలోని నార్త్ కరోలినాలోని ఓ ప్రాంతంలో పోలీసులు ఓ ఆపరేషన్ ప్రారంభించారు. దాంతో ఆ ప్రాంతంలో కొంచెం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఆ ప్రదేశంలో ఓ పార్శిల్ ను డెలివరీ చేయడానికి ఓ వ్యక్తి వెళ్లి పార్శిల్ ను అందించాడు. నార్త్ కరోలినా క్యారీలో గత నెలలో ఈ ఘటన చోటు చేసుకుంది.
” మీరు మీ వ్యాపారంలో ఉన్నప్పుడు ఏదీ మీ దారికి అడ్డురాదు” అనే క్యాప్షన్ తో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. పోలీస్ స్టాండ్ ఆఫ్ కొనసాగుతున్న సమయంలో ఆ ప్రదేశానికి అమెజాన్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ వెళ్తున్నారు. అయితే అతడు పార్శిల్ అందించాల్సిన ఇంటికి చేరుకోలేకపోయాడు. కానీ స్వాట్ సభ్యుడికి పార్శిల్ అందించాడు.
డెలివరీ చేసే వ్యక్తి నిబద్ధతకు నెటిజన్లు సలాం కొడుతున్నారు. పోలీసులు ఓ నిందితుని కోసం దాదాపు 24 గంటలుగా సెర్చింగ్ మొదలు పెట్టారు. కానీ గుర్తు తెలియని నిందితుడు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ సెర్చింగ్ ఆపరేషన్ ముగిసింది.
Amazon driver delivers packaged through a SWAT situation pic.twitter.com/hBjCqJDBnF
— austin frisch (@realaustinzone) March 19, 2023