గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పుష్ప. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. అలాగే సమంత స్పెషల్ సాంగ్ లో నటించింది. మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాసిల్ విలన్ గా నటించారు. అయితే ఈ చిత్రం జనవరి 7 నుంచి అమెజాన్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.
కాగా పుష్ప పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ వారు 22 కోట్ల రూపాయలను చెల్లించారట. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 17 న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.