ఇథియోపియాలోని కాంబాటా అనే ప్రాంతంలో రోమా అనే ట్రైబ్ వారు శారీరకంగా ధృఢంగా ఉండేవారు. దీంతో వీరిని అనేక పనుల నిమిత్తం డబ్బున్న వారు కొనుక్కునేవారు.అలా ఈ తెగకు చెందిన చాపూ అనే వ్యక్తిని 1548 లో మొదట యెమన్ దేశానికి చెందిన ఓ డబ్బున్న మనిషి కొనుక్కున్నాడు. తర్వాత అతడి కిరాయి టైమ్ అయిపోవడంతో ఈ సారి బాగ్దాద్ వ్యాపారి కొనుకున్నాడు….అలా చేతులు మారుతూ వస్తున్న ఆ కండల వీరుడిని 1570లో చంఘీజ్ ఖాన్ కొనుక్కున్నాడు.
అతడికి అనేక యుద్ద విద్యలు నేర్పాడు…అతడి పేరును చాపూ నుండి అంబర్ గా మార్చాడు! అలా 1595లో ఆహ్మద్ నగర్ నవాబ్ దగ్గరకు చేరిన అంబర్…మొఘలుల దాడిని సమర్థవంతంగా తిప్పి కొట్టాడు. ఆ తర్వాత అదే ప్రాంతానికి రాజయ్యాడు. 2 లక్షల సైన్యాన్ని స్థాపించి ఆ ప్రాంతాన్ని చాలా కాలం శాసించాడు. జామామజీద్ ,కాలీ మజీద్ ఇతడు నిర్మించినవే.! అలా ఓ బానిస రాజుగా పాలన కొనసాగించాడు.