గుడివాడ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ నాయకులకు కాస్త గట్టిగానే కోపం తెప్పించినట్టు కనిపిస్తోంది. వరుసగా ఒకరి తర్వాత ఒకరు వైసీపీ నేతలు మీడియా ముందుకు వచ్చి పవన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే మంత్రి కొడాలి నాని, పేర్ని నాని పవన్ వ్యాఖ్యలపై స్పందించిగా తాజాగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా స్పందించారు.
అరే సాంబా రాసుకో.. గెలిచిన వాళ్ళు కాదు ఓడినోడే బోడిలింగాలు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతులకు పరిహారం ఇవ్వకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని పవన్ చేసిన వ్యాఖ్యలపై అంబటి ఎద్దేవ చేశారు. అసెంబ్లీ ముట్టడికి ఇదేమైనా సినిమా షూటింగా అంటూ విమర్శించారు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కాదని నకిలీ సాబ్ అంటూ కౌంటర్ ఇచ్చారు.