పశ్చిమ బెంగాల్‌లో షేక్ హీరా అనే అంబులెన్స్ డ్రైవర్ కు అదృష్టం అంబులెన్స్ లా.. సైరన్ మోగిస్తూ మరీ దూసుకొచ్చింది. పొద్దున్నే రూ. 270 పెట్టి లాటరీ టికెట్ కొన్నాడు. సాయంత్రానికి కోటి రూపాయల జాక్ పాట్ తగిలింది. తన అదృష్టానికి ఉబ్బి తబ్బిబ్బైన హీరా..తనకు లభించిన లాటరీ సొమ్ముతో అనారోగ్యంతో ఉన్న తన తల్లికి మంచి వైద్యం చేయిస్తానని.. ఓ మంచి ఇల్లు కట్టుకుంటానని చెప్పాడు.