బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమీర్ ఖాన్ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. సోషల్ మీడియా నుంచి శాశ్వతంగా తప్పుకొంటున్నట్టు అనౌన్స్ చేశాడు. 56 వ బర్త్ డేకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలిపిన అమీర్ ఖాన్.. అదే పోస్టులో ఈ కీలక విషయాన్ని ప్రకటించాడు.
‘ఇదే నా ఆఖరి పోస్ట్’ అని చెప్తూ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశాడు.ఇంతకు ముందులాగే అందరితోనూ కమ్యూనికేషన్ కొనసాగుతుందని చెప్పుకొచ్చాడు.. తన ఫ్యూచర్ ప్రాజెక్టులకు సంబంధించిన అప్‌డేట్స్ తన ప్రొడక్షన్ బ్యానర్ (akppl_official) అధికారిక ఖాతాలో పంచుకుంటానని స్పష్టం చేశాడు.ఆమీర్ ఖాన్ ఇలా ఊహించని విధంగా సోషల్ మీడియా నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.
— Aamir Khan (@aamir_khan) March 15, 2021