ఇండియాకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని అగ్రరాజ్యం అమెరికా మరోసారి స్పష్టం చేసింది. భారత్ కు ఎప్పుడూ తాము అండగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తెలిపారు.
అమెరికా నుంచి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ రష్యా నుంచి భారత్ , మరికొన్ని ఆసియా దేశాలు ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నాయని, ఈ విషయంలో భారత అధికారులతో ఏమైనా చర్చలు జరిపారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వేశారు.
వాటిపై స్పందించిన ఆయన… రష్యా-ఇండియాల మధ్య ఎన్నో దశాబ్దాలుగా బలమైన సంబంధాలు ఉన్నాయని ఆయన చెప్పారు. భారత ప్రభుత్వాన్ని భాగస్వామిగా చేసుకునేందుకు అమెరికా సిద్ధంగా లేనప్పుడూ ఆ ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు.
ఇప్పటికే భారత ప్రతినిధులతో చాలాసార్లు తాము చర్చలు జరిపామన్నారు. రష్యాతో ఒక్కో దేశానికి ఒక్కో రకమైన సంబంధాలున్నాయని, ఆ విషయం తమకు తెలుసని అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ ప్రతినిధి నెడ్ ప్రైస్ వివరించారు..