పలు చైనా యాప్స్ తమ దేశ పౌరుల డేటా చోరీకి పాల్పడుతున్నాయంటూ వాటిపై ఆంక్షలు పెట్టిన అమెరికా ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వెయ్యి మందికి పైగా చైనీయుల వీసాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, సంచలనం రేపింది. వీరంతా చైనా మిలటరీతో సంబంధాలు కలిగి ఉన్నారని, అమెరికా సున్నితమైన సమాచారాన్ని చైనా ఆర్మీకి చేరవేస్తున్నారన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. చైనా జిన్ జియాంగ్ లోని ఉగర్ ముస్లింల పట్ల చైనా ప్రవర్తిస్తున్న తీరును అమెరికా తప్పుపట్టింది.
అమెరికాలో జరుగుతున్న కరోనా వైరస్ వ్యాక్సిన్ సమాచారాన్ని చైనా విద్యార్థులు కొంత మంది తమ దేశానికి చేరవేస్తున్నారని అమెరికా మండిపడింది. వారి వీసాలనే ఇప్పుడు రద్దు చేశామంది. అమెరికాలో విద్యాభ్యాసం కోసం 3.60లక్షల మంది విద్యార్థులు చదువుకునేందుకు వచ్చారు. దీంతో వీరంతా ఇప్పుడు భయం భయంగా ఉన్నట్లు ప్రచారం సాగుతుంది.
తాము ఎన్నిసార్లు చెప్పినా డ్రాగన్ తన తీరు మార్చుకోవటం లేదని, చైనా ప్రవర్తన ఇలాగే ఉంటే తమ నుండి ఆంక్షలు మరింత కఠినం అవుతాయని అమెరికా హెచ్చరిస్తుంది.