ప్రపంచ పెద్దన్నగా, అగ్రరాజ్యంగా కొనసాగుతున్న అమెరికా తీవ్ర అప్పుల్లో కూరుకపోయింది. ఒబామా పాలన నుండి ఆ అప్పులు భారీగా పెరిగిపోయాయి. వివిధ ఆర్థిక అవసరాల కోసం అమెరికా ఇప్పటి వరకు 27.9 ట్రిలియన్ డాలర్ల అప్పు చేసింది. ఇందులో చైనా, జపాన్ ల వద్ద ఒక్కో ట్రిలియన్ అప్పులు చేసింది.
ఇక అమెరికా భారత్కు 216 బిలియకన్ డాలర్లు బాకీ ఉంది. ఈ విషయాన్ని ఆ దేశ చట్టసభ్యలు, రిపబ్లికన్ పార్టీ నేత అలెక్స్ మూనీ వెల్లడించారు. అమెరికా అప్పుల్లో కూరుకుపోయిందని, ఈ పరిస్థితి నుంచి బయటపడే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం తలపెట్టిన ప్రత్యేక ప్యాకేజీని విరమించుకోవాలని, భవిష్యత్ గురించి ఒక్కసారి ఆలోచించండని అలెక్స్ మూనీ కోరారు. ఇప్పుడున్న అప్పుల ప్రకారం ఒక్కో అమెరికన్ పై సగటున 84వేల డాలర్లు అప్పు ఉందన్నారు.
2000వ సంవత్సరం నాటికి అమెరికా అప్పు 5.6 ట్రిలియన్ డాలర్లుగా ఉండేది. ప్రస్తుతం ఉన్న అప్పులను చూస్తే… 2050 నాటికి అమెరికా బాకీలు 104 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందనేది అంచనా.