కరోనా మహమ్మారి విజృంభణతో తల్లడిల్లిపోతున్న అగ్రరాజ్యం ఇక కుదుటపడనుంది. నేటి నుంచి కరోనా వ్యాక్సినేషన్‌కు అమెరికా సిద్దమైంది. అత్యవసర వినియోగానికి ఆమోదం పొందిన ఫైజర్–బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ మొదటి డోసులను ఇవాళ్టి నుంచి అక్కడి ప్రజలకు ఇస్తారు.
మిషిగన్‌లోని ఫైజర్ ఫ్యాక్టరీ నుంచి .. అమెరికాలోని 145 సరఫరా కేంద్రాలకు ఇప్పటికే వ్యాక్సిన్లను చేర్చారు. వీటిని మైనస్ 94 డిగ్రీల ఉష్ణోగ్రతలో స్టోర్ చేయాల్సి ఉండటంతో.. తగ్గట్లు ఫైజర్ ఏర్పాట్లు చేశారు. ఉష్ణోగ్రతలను ఎప్పటికప్పుడు పరీక్షించేందుకు.. వ్యాక్సిన్ బాక్సుల్లో జీపీఎస్‌ను ఏర్పాటు చేశారు. కాగా మొదటి విడతలో అమెరికాలో 30 లక్షల వ్యాక్సిన్లను పంపిణీ చేయనున్నారు. మొదట కరోనా వారియర్స్ జాబితాలో ఉన్న వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ ఇస్తారు. మూడు వారాల తర్వాత మళ్లీ వారికి రెండో డోసు పంపిణీ చేస్తారు.