అగ్రరాజ్యం అమెరికాపై మంచు తుఫాన్ విరుచుకుపడుతోంది. ఆ దేశంలోని చాలా రాష్ట్రాలు మంచు తుఫాన్ తో అల్లాడుతున్నాయి. అమెరికా దక్షిణాది, మధ్య రాష్ట్రాలు మంచు తుఫాన్ తో వణికిపోతున్నాయి. చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో చాలా మంది అంధకారంలోకి వెళ్లిపోయారు.
కీలకమైన టెక్సాస్ పరిస్థితి దారుణంగా ఉంది. ఆ రాష్ట్రం మొత్తాన్ని మంచు కప్పేసింది. తీవ్రంగా కురుస్తున్న మంచుతో అధికారులు పవర్ ఎమర్జెన్సీ విధించారు. రాష్ట్రం వ్యాప్తంగా మంచు తుఫాన్ ప్రభావం ఉన్నందున ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే ప్రకటించారు. వాహనాల రాకపోకలు నిలిచిపోగా, విమానాలు కూడా రద్దవుతున్నాయి. మరోవైపు శీతల గాలులు కూడా పెరుగుతుండటంతో… ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
రోడ్లన్నీ ప్రమాదకరంగా మారిపోయాయి. టెక్సాస్‌తో పాటు కెంటుకీ, మిస్సిస్సిప్పీ, అలబామా, ఒరెగాన్, ఓక్లహోమా రాష్ట్రాలు మంచులోనే ఉండిపోయాయి. అలాగే డల్లాస్, హూస్టన్ నగరాలల్లో కూడా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయినట్లు తెలుస్తోంది.