కరోనా వైరస్ కారణంగా ప్రపంచం అంతా చైనాను వెలెత్తి చూపిస్తున్న సమయంలో… చైనాపై మరో దర్యాప్తు సంస్థ సంచలన ఆరోపణ చేసింది. ఇప్పటికే చైనా వైరస్ అంటూ అమెరికా మండిపడుతున్న దశలో కరోనాపై ప్రపంచాన్ని అలర్ట్ చేయటంలో WHOను చైనాను బెదిరించిందని అమెరికా నిఘా సంస్థ సంచలన నివేదిక ఇచ్చింది.
ఇప్పటికే బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు చైనా వైఖరిని తప్పుబడుతున్నాయి. ఇప్పటికే జర్మనీ నిఘా సంస్థ డేర్ స్పైగల్ కూడా ప్రపంచాన్ని చైనా తప్పుదోవ పట్టించిందని, అందులో WHO పాత్రపై అనుమానాలున్నట్లు నివేదిక ఇచ్చింది.
WHOకు వచ్చే నిధుల విషయంలో చైనా బెదిరింపులకు దిగి, ముందస్తుగా ప్రపంచాన్ని అలర్ట్ కావటంలో ఆలస్యం చేసిందని… పైగా ఈ లోపే చైనాకు భారీ ఎత్తున మందులు దిగుమతి చేసుకున్నారని నివేదికలో పేర్కొన్నట్లు న్యూస్ వీక్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.
ఇక తాజా పరిణామాలతో ట్రంప్ చైనా, WHOపై తన దాడిని ఉదృతం చేస్తున్నాడు. అయితే… ఇది అమెరికా ముందస్తు ప్రణాళికతో తెప్పించుకున్న నివేదికగా చైనా అనుకూల దేశాలు వ్యాఖ్యానిస్తున్నాయి.