ప్రధాని నరేంద్రమోడీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా ప్రధాని, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ తో ప్రధాని సమావేశం అయ్యారు. తాజాగా అమెరికా ప్రెసిడెంట్ జో బైడన్ తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు.
ప్రధానితో భేటీ సందర్భంగా జో బైడన్… మోడీకి తను కూర్చోవాల్సిన కుర్చీ చూపించారు. ఆ కుర్చీ చూపిస్తూ… ఈ కుర్చి ప్రతి రోజు ఇండియన్ అమెరికన్ కూర్చునేదే అని తెలిపారు. అంటే ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ బైడెన్ పక్కన ఉంటారు. ఆ సీటు తనదే… అమెరికాలో ఇండియన్ అమెరికన్స్ కు ఉన్న ప్రాధాన్యత ఇది అని బైడెన్ చెప్పకనే చెప్పినట్లు అర్థమవుతుంది.
కమలా హ్యారిస్ తల్లి భారతీయురాలు. ఇండియా నుండి అమెరికా వచ్చి వైద్యురాలిగా స్థిరపడ్డారు.