ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు అధికారాన్ని చేపడుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాలిబన్లతో అందరి కన్నా చైనాకు పెద్ద సమస్య ఉంటుందని, అందుకే పరిష్కారం కోసం వారు ఏర్పాట్లు చేసుకుంటున్నారన్నారు. పాక్, రష్యా, ఇరాన్ కూడా ఇదే కోవలో ఉన్నాయన్నారు.
తాలిబన్లకు అమెరికా చేసే ఆర్థిక సహయం ఇప్పటికే నిలిపేయగా… చైనా, రష్యా మాత్రం నిధులు సమకూర్చుతున్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆఫ్ఘన్ తో కలిసి పనిచేసేందుకు రెడీ గా ఉన్నాయని జీ-7 దేశాలు ఇప్పటికే ప్రకటించగా, వారి పాలన చట్టబద్ధమే అని గుర్తించేందుకు చైనా కూడా రెడీగా ఉందని అమెరికా వార్తా సంస్థ కథనం ప్రచురించింది.
ఇటు చైనా తమకు అనుకూలంగా ఉండటంతో పాటు నిధులు సమకూర్చుతున్నందునే… తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటు సమావేశానికి చైనాకు కూడా ఆహ్వానం పంపినట్లుగా విదేశాంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.