దేశీ ఐటీ నిపుణులు, ఐటీ కంపెనీలకు షాక్‌నిస్తూ హెచ్1 బీ వీసాలపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరో నిర్ణయం తీసుకున్నారు. వీటిపై గతేడాది విధించిన నిషేధాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో వీసాల జారీకి మార్చి నెలాఖరువరకూ వీలుకాదని అమెరికన్ కాన్సులేట్ వర్గాలంటున్నాయి.
దాదాపు 8 నెలలుగా హెచ్1 బీ, వర్క్ వీసాలపై ఆంక్షలు కొనసాగుతుండగా… ట్రంప్ ఇప్పుడు మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్-19 వల్ల ఉపాధి కోల్పోయి అమెరికా ప్రజల ఆరోగ్యాలపై ప్రతికూల ప్రభావం పడిందని, నిరుద్యోగ శాతం పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ట్రంప్ వెల్లడించారు.
హెచ్1 బీ, ఇతర వర్క్ వీసాల జారీపై ట్రంప్ 2019 ఏప్రిల్ 22న తొలిసారి నిలుపుదలకు ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత జూన్ 22న 6 నెలలపాటు నిషేధాన్ని పొడిగించారు. దీంతో ఆ నిషేధం డిసెంబర్ 31తో పూర్తైంది. ఇప్పుడు ఆ నిషేధాన్ని మార్చి 31వరకూ నిషేధం అమలుకానుంది. ఫలితంగా భారీ సంఖ్యలో భారత ఐటీ నిపుణులు, పలు అమెరికన్, దేశీ సాఫ్ట్‌వేర్ సేవల కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడనుంది.