సైనిక దళాల్లో అగ్ని వీరులుగా చేరాలని యువతను భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే కోరారు. అగ్ని పథ్ పథకం కింద సైన్యంలో చేరేందుకు యువతకు వయోపరిమితిని 21 నుంచి 23 ఏండ్లకు పెంచినట్టు ఆయన తెలిపారు.
ఈ వయోపెంపు ఈ ఒక్క సారి మాత్రమే అమలులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. గడిచిన రెండేండ్లలో కొవిడ్ వల్ల రిక్రూట్ మెంట్ ను నిర్వహించలేకపోయామని తెలిపారు.
ఈ నిర్ణయం దేశ భక్తులైన యువతకు మంచి అవకాశాన్ని కల్పిస్తుందని ఆయన చెప్పారు. కొవిడ్ సమయంలో తీవ్రంగా కష్టపడిన యువతకు ఇది ఒక అద్భుతమైన అవకాశం అని ఆయన చెప్పుకొచ్చారు.
రిక్రూట్ మెంట్ కు సంబంధించిన ప్రకటనను త్వరలోనే విడుదల చేస్తామని ఆయన అన్నారు. అగ్నిపథ్ పై ఆందోళనలు ఊపందుకున్నాయి. ఆందోళనల నేపథ్యంలో సైన్యంలో చేరేందుకు గరిష్ఠ అర్హత వయస్సును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.