అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఇటీవల పలు ప్రాంతాల్లో నిర్వహించిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు ప్రభుత్వ, ప్రజా ఆస్తులకు భారీగా నష్టం కలిగించారు. దీనిపై దర్యాప్తు జరుగుతోంది.
ఈ క్రమంలో త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోడీ నేడు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా అగ్నిపథ్ పథకం, దానికి సంబంధించి జరిగిన హింసాత్మక ఘటనలతో పలు కీలక అంశాలపై అధికారులతో ఆయన చర్చించనున్నారు.
ఈ సమావేశాల్లో భాగంగా ముందుగా నేవీ చీఫ్ ఆర్ హరి కుమార్ తో ప్రధాని మోడీ భేటీ అవుతారని సమాచారం. ఇక ఓ వైపు ఆందోళనలు కొనసాగుతుండగానే మరో వైపు అగ్నివీరుల రిక్రూట్ మెంట్ కు నోటిఫికేషన్లను కేంద్రం జారీ చేస్తోంది.
ఈ క్రమంలో త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోడీ సమావేశం అవుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.