ద్రవ్యోల్బణం వంటి సమస్యలతో చాలావరకు ప్రపంచ దేశాలు సతమతమవుతున్నప్పటికీ.. వాటి ఆర్థికవ్యవస్థలు మందకొడిగా ఉన్నా.. ఇండియా మాత్రం తన ఎకానమీని మెరుగుపరచుకోగలిగిందని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. భారత స్థూల వృద్ధి రేటు అంచనాలను సవరించిన బ్యాంక్.. 2022-23 సంవత్సరానికి ఇది 6.9 శాతం ఉండవచ్చునని పేర్కొంది.
గ్లోబల్ గా వస్తున్న ఎన్నో షాక్స్ ని తట్టుకుని ఇండియా తన ఎకానమీకి మెరుగులు దిద్దుకుంది.. ఇతర వర్ధమాన దేశాల ఆర్థిక వృద్ది రేటు విషయానికి వస్తే.. భారత్ ఆర్ధిక వ్యవస్థ వృద్ధి రేటు చాలావరకు కుదుట పడింది. అక్టోబరులో భారత జీడీపీ రేటును మేం 7.5 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గించాం.. కానీ ఈ సారి దీన్ని 2022 మార్చి నుంచి 2023 మార్చి వరకు గల కాలానికి 6.9 శాతానికి పెంచి సవరించాం అని వాల్డ్ బ్యాంక్ ఓ నివేదికలో తెలిపింది.
‘నేవిగేటింగ్ ది స్టామ్’ పేరిట ఈ రిపోర్టును బ్యాంక్ వెలువరించింది. ఇతర ప్రపంచ మార్కెట్లతో పోలిస్తే.. భారత మార్కెట్ మంచి స్థితిలో ఉందని ఈ నివేదిక కితాబునిచ్చింది. ప్రపంచ దేశాల నుంచి వాణిజ్య దిగుమతులు తగ్గినప్పటికీ తన దేశీయ మార్కెట్ ని ఇండియా విస్తృతపరచుకోగలిగిందని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మెరుగుపరచుకోవడం ద్వారా తన ప్రస్తుత అకౌంట్ లోటును భర్తీ చేసుకోగలిగిందని ప్రపంచ బ్యాంక్ తెలిపింది.
ఇండియాలోని వాల్డ్ బ్యాంక్ కంట్రీ డైరెక్టర్ అగస్తే టానో కౌమే ఈ నివేదికను విడుదల చేశారు.2023-24 లో కూడా భారత ఎకానమీ కొద్దిగా తగ్గినా 6.6 శాతం ఉండవచ్చునని ఆయన పేర్కొన్నారు. జీ-20 అధ్యక్ష బాధ్యతలను ఇండియా చేబట్టిన సందర్భంలో వాల్డ్ బ్యాంక్ .. దేశ ఎకానమీకి సంబంధించి ఈ ఆశావహ నివేదికను విడుదల చేయడం విశేషం.