ఉక్రెయిన్ పై యుద్ధం నేపథ్యంలో రష్యా తీరును ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. ఉక్రెయిన్ విషయంలో రష్యా తీరుపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ కు వ్యతిరేకంగా ఐఫిల్ టవర్ ముందు కొందరు యువతులు టాప్ లెస్ గా నిలబడి తమ నిరసనలు తెలిపారు.
దీనికి సంబంధించిన వీడియో ఇప్పడు వైరల్ అవుతోంది. వీడియోలో కొందరు యువతులు టాప్ లెస్ గా ఉన్నారు. వారి శరీరాలపై ఉక్రెయిన్ జాతీయ జెండాను పెయింటింగ్ చేయించుకున్నారు.
వారంతా ఈఫిల్ టవర్ ముందు నిల్చుని పుతిన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యుద్దం ఆపండి. ఫెమినిస్టులు యుద్ధానికి వ్యతిరేకం అంటూ స్లోగన్స్ చేశారు.
ఈ వీడియోను థామస్ మోరే అనే వ్యక్తి ట్విట్టర్ లో ఈ ఏడాది మార్చి 7న అప్ లోడ్ చేశారు. దీన్ని నెటిజన్లు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. రష్యా తీరును నిరసిస్తూ రష్యా వ్యతిరేక కామెంట్లను నెటిజన్లు పెడుతున్నారు.