ప్రధాని మోడీ జర్మనీ రాజధాని బెర్లిన్ లో పర్యటిస్తున్నారు.మూడు రోజుల పర్యటనలో భాగంగా నిన్న ఉదయం జర్మనీ చేరుకున్నారు.బ్రాండన్ బర్గ్ విమానాశ్రయంలో ఆయనకు జర్మనీ అధికారులు ఘన స్వాగతం పలికారు.
హోటల్ అలన్ కెంపెన్స్కీకి చేరుకున్నప్రధానితో భారతీయ సంతతికి చెందిన ప్రజలు ముచ్చటించారు.మోడీని చూసి అందరూ వందేమాతరం,భారత్ మాతాకీ జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా చిన్నారులతో ఆయన మాట్లాడారు. ఒక చిన్నారి మోడీకి చిత్రపటాన్నిబహుమతిగా ఇచ్చింది.ప్రధాని మోడీ తనకు ఆదర్శమని ఆ బాలిక చెప్పింది. ఆ తర్వాత ఒక బాలుడు పాడిన పాటకు మోడీ ఫిదా అయ్యారు.
దేశ భక్తి ఉట్టిపడేలా సాగిన ఆ పాటకు ప్రధాని చిటెకెలు వేశారు. అద్భుతంగా పాడినందుకు బాలుడిపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని జర్మనీతో పాటు డెన్మార్క్, ఫ్రాన్స్ లలో కూడా పర్యటించనున్నారు.