కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేసిన సినిమా అమిగోస్. ఈ సినిమాతో ఓ ప్రయోగం చేశాడు కల్యాణ్ రామ్. అతడి కెరీర్ లో చేసిన ఎన్నో ప్రయోగాల్లో ఇది కూడా ఒకటి. కాకపోతే ఈసారి ఆశించిన స్థాయిలో ఫలితం అందుకోలేకపోయాడు. అమిగోస్ సినిమా థియేటర్లలో ఫ్లాప్ అయింది.
రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది అమిగోస్ సినిమా. ఈ సినిమా కోసం మంచి పాయింట్ ఎంచుకున్నాడు దర్శకుడు. కల్యాణ్ రామ్ కూడా ఆ పాయింట్ నచ్చి సినిమాకు ఓకే చెప్పాడు. కానీ నెరేషన్ మాత్రం పేలవంగా ఉంది. రొటీన్ సన్నివేశాలతో బోర్ కొట్టించాడు దర్శకుడు.
దీంతో చెప్పాలనుకున్న పాయింట్, ప్రేక్షకులకు కనెక్ట్ అయినప్పటికీ, పరాజయం తప్పలేదు. అలా కల్యాణ్ రామ్ ఫ్లాప్ అందుకున్నాడు. బింబిసార సక్సెస్ ను కొనసాగించలేకపోయాడు.
అమిగోస్ సినిమాకు సరైన ఓపెనింగ్స్ రాలేదు. మొదటి రోజు 2 కోట్ల 20 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. అదే రోజు సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో, శనివారం నుంచి సినిమా పడిపోయింది. ఇక ఆదివారం ఆక్యుపెన్సీ పూర్తిగా తేలిపోయింది.