Amigos Movie Review in Telugu: స్టోరీ అదిరిపోలా.. కళ్యాణ్ రామ్ ఖాతాలో మరో హిట్ పడ్డట్టేనా..?
నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్ , అషికా రంగనాథ్, నితిన్ ప్రసన్న,.
దర్శకత్వం: రాజేంద్ర రెడ్డి
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై రవిశంకర్.
సినిమాటోగ్రఫీ: సౌందర రాజన్
బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్
మ్యూజిక్, జిబ్రాన్

కథ: ఈ సినిమాలో హీరో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే సిద్దూ గా తొలి చూపులోనే ఇషికాతో లవ్ లో (అషికా రంగనాథ్) పడతాడు. ఆ తర్వాత రెండు కుటుంబాలు ఒప్పుకోవడంతో సిద్దూ, ఇషికా నిశ్చితార్థం అవుతుంది. ఈ టైమ్ లో మనుషులను పోలిన మనుషుల గురించి తెలిపే వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవడంతో మైఖేల్ అలియాస్ బిపిన్ రాయ్, మంజునాథ్ పరిచయం అవుతారు. మైఖేల్ కుట్రకు మంజునాథ్ జాతీయ భద్రతాధికారులకు దొరికిపోతాడు. ఇక సిద్దూ స్థానంలోకి వచ్చి మైఖేల్ వచ్చి వారి ఇంట్లో తిష్టవేస్తాడు.
అయితే ఇందులో మైఖేల్ ఎవరు..? దేశానికి ఎలాంటి కుట్రలు చేశాడు..? సిద్దూ, మంజునాథ్‌లను ఎలా వాడుకున్నాడు. మైఖేల్ చేసిన కుట్రలకు మంజునాథ్ ఎలాంటి సమస్యలు పడ్డాడు..? సిద్దూ జీవితంలో జరిగిన సంఘటనలు ఏమిటనే ప్రశ్నలకు సమాధానమే అమిగోస్ సినిమా కథ.
Also Read: బాలయ్య సరసన టాలీవుడ్ చందమామ!