లెక్కప్రకారం, ఈపాటికి కల్యాణ్ రామ్ సినిమా నుంచి సాంగ్ రిలీజ్ కావాలి. కానీ ఆ పాట విడుదల కార్యక్రమాన్ని నిరవధికంగా వాయిదా వేశారు. ఆ పాటకు ఓ ప్రత్యేకత ఉంది.
కల్యాణ్ రామ్ తాజా చిత్రం అమిగోస్. ఈ సినిమాలో ఓ రీమిక్స్ సాంగ్ ఉంది. బాలకృష్ణ నటించిన హిట్ సినిమాలోని ఎన్నో రాత్రులొస్తాయికానీ.. అనే హిట్ సాంగ్ ను అమిగోస్ సినిమా కోసం రీమిక్స్ చేశారు. జిబ్రాన్ సంగీతం అందించాడు.
ఈ పాటకు సంబంధించి ఆల్రెడీ ప్రోమో రిలీజ్ చేశారు. అది చాలా రిచ్ గా ఉంది. ఇక సాంగ్ కోసం అందరూ వెయిట్ చేస్తున్న టైమ్ లో ఆ విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేశారు. దీనికి కారణం ఉంది.
లోకేష్ పాదయాత్రలో నటుడు, నందమూరి కుటుంబసభ్యుడు తారకరత్న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. బెంగళూరులోని ఓ హాస్పిటల్ లో ప్రస్తుతం చికిత్స పొందుతున్న తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబసభ్యుడు ఐసీయూలో ఉండడంతో, కల్యాణ్ రామ్ తన సాంగ్ రిలీజ్ ను వాయిదా వేసుకున్నాడు.