కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న సినిమా అమిగోస్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోంది. ఇందులో కల్యాణ్ రామ్ 3 డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తున్నాడు.
ఓ లుక్‌లో మెలివేసిన మీసాలతో స్టైలిష్ లుక్‌లో కనిపించే బిజినెస్ మేన్ సిద్ధార్థ్ పాత్ర అది. తర్వాత మంజునాథ్ అనే అమాయకుడి పాత్రలో కనిపించాడు. తాజాగా ఓ అజ్ఞాతవ్యక్తి పాత్ర ను కూడా విడుదల చేశారు. ఇలా ఒకదానితో ఒకటి సంబంధం లేని 3 విభిన్న లుక్స్ లో కనిపిస్తున్నాడు కల్యాణ్ రామ్.
అసలు ఈ మూడు లుక్స్‌కి ఉన్న రిలేషన్ ఏంటి? కల్యాణ్ రామ్ అసలు పాత్ర ఏంటనేది తెలుసుకోవాలంటే ఈ ఆదివారం వరకు ఆగాల్సిందే. ఎందుకంటే, ఆదివారం ఈ సినిమా టీజర్ వస్తోంది.
రాజేందర్ రెడ్డి డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అషికా రంగనాధ్ హీరోయిన్ గా నటిస్తోంది. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. ఫిబ్రవరి 10న థియేటర్లలోకి రాబోతోంది అమిగోస్.