వైవిధ్యమైన సినిమాలు, పాత్రలు చేయటానికి ఆసక్తి చూపిస్తున్నాడు కల్యాణ్ రామ్. రీసెంట్ గా బింబిసార వంటి డిఫరెంట్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్ ఇప్పుడు అమిగోస్ అంటూ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ‘అమిగోస్’…. ఈ టైటిల్ ఏంటి కొత్తగా ఉందని అనిపిస్తుందా… టైటిలే కాదు.. కాన్సెప్ట్ కూడా టాలీవుడ్ ఆడియెన్స్‌కు ఓ సరికొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుందని అంటున్నారు దర్శకుడు రాజేంద్ర రెడ్డి.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ఫిబ్రవరి 10న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ గా విడుదలవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్ కూడా ఆడియెన్స్‌ను ఎట్రాక్ట్ చేస్తుంది. అందులో భాగంగా ‘అమిగోస్’ టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌తో సినిమాపై అంచనాలు నెక్ట్స్ లెవల్‌కు చేరాయి.
ఇప్పటి వరకు తాను చేసిన పాత్రలకు భిన్నంగా ‘అమిగోస్’ చిత్రంలో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేశాడు. ఔత్సాహిక వ్యాపారవేత్తగా, సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా, కిల్లర్ గా… ఓ కళ్యాణ్ రామ్ పాత్రను మరో కళ్యాణ్ రామ్ చంపాలనుకోవటం.. దాని చుట్టూ జరిగే ఆసక్తికరమైన కథ.. మూడు పాత్రలు ఒక చోట కలుసుకోవటం.. లాంటివి టీజర్ లో చూపించారు.
అసలు ఒకేలా ఉన్న ఆ ముగ్గురు ఎవరు? అన్నదమ్ములా.. స్నేహితులా .. అసలు ఒకరినొకరు ఎందుకు చంపుకోవాలనుకుంటున్నారు? ఇలాంటి ఎగ్జయిటింగ్ ప్రశ్నలెన్నో టీజర్ చూస్తుంటే మనసులో మెదులుతాయి. కళ్యాణ్ సరసన ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తుంది. జిబ్రాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎస్.సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్‌గా.. తమ్మిరాజు ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.