కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న సినిమా అమిగోస్. రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను 10వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా కర్నూలు వెళ్లాడు కల్యాణ్ రామ్. అలా ప్రేక్షకుల సమక్షంలో గ్రాండ్ గా రిలీజైంది అమిగోస్ ట్రైలర్.
ట్రైలర్ విషయానికొస్తే.. కల్యాణ్ రామ్ నటించిన 3 పాత్రల్ని ఇందులో పరిచయం చేశారు. టీజర్ లోనే 3 పాత్రల్ని పరిచయం చేసినప్పటికీ, ట్రైలర్ లో ఆ పాత్రల ఛాయల్ని, లుక్స్ ను కూడా దాదాపు చెప్పేశారు. అంతేకాకుండా, సినిమా కథ ఎలా ఉంటుందనే విషయాన్ని కూడా ట్రైలర్ లో చూచాయగా చెప్పేశారు.
3 లుక్స్ లో కల్యాణ్ రామ్ బాగున్నాడు. అషికా రంగనాధ్ కూడా ఆకట్టుకుంది. సూపర్ హిట్ రీమిక్స్ “ఎన్నో రాత్రులొస్తాయి” సాంగ్ కు కూడా ట్రైలర్ లో స్థానం కల్పించారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.
బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అమిగోస్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతోంది ఈ సినిమా.