బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ తన 25వ పుట్టినరోజును కుటుంబం, స్నేహితులతో కలిసి స్విమ్మింగ్ పూల్ లో జరుపుకుంది. ఈ బర్త్ డే గర్ల్ తన తల్లిదండ్రులు అమీర్, రీనా, ప్రియుడు, సవతి సోదరుడితో కలిసి పుట్టినరోజు కేక్ కట్ చేసింది. ఇరా తన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూల్ పార్టీని కూడా ఏర్పాటు చేసింది.
ఇంట్లోనే ఉన్న ఇండోర్ స్విమ్మింగ్ పూల్ లో ఇరాతో పాటు, ఆమె ఫ్రెండ్స్ అంతా ఈత కొట్టారు. ఈ సందర్భంగా ఇరా, ఆమె బాయ్ ఫ్రెండ్ నుపూర్ శిఖర్ రొమాంటిక్ గా కనిపించారు. ఒకటే కౌగిలింతలు, ముద్దులు. ఇవన్నీ తండ్రి అమీర్ ఖాన్ సమక్షంలో, అతడి ఇంట్లోనే ఓపెన్ గా జరిగాయి.
పాతికేళ్లు వచ్చిన ఇరా.. ఇలా బికినీలోనే కేక్ కట్ చేయడం, తండ్రి అమీర్ దగ్గరుండి చప్పట్లు కొట్టడం, మరోవైపు ప్రియుడు లిప్ కిస్సులు ఇవ్వడం.. ఇదంతా చూసిన నెటిజన్లకు ఒళ్లు మండింది. ప్రస్తుతం ఆ ఫొటోలపై సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ నడుస్తోంది. కనీసం తండ్రి ఉన్నప్పుడైనా బికినీ తీసేసి, మంచి డ్రెస్ వేసుకోవచ్చు కదా అంటూ ఇరాకు ఉచిత సలహాలిస్తున్నారు. అది సాధ్యం కానప్పుడు బికినీపై ఓ కోటు వైసుకున్నా సరిపోయేదంటూ సూచన చేస్తున్నారు.
ఇరా మాత్రం ఇవన్నీ పట్టించుకునే మూడ్ లో లేదు. పాతికేళ్లు వచ్చిన సందర్భంగా ఆమె మరింత రెచ్చిపోతోంది. ప్రియుడితో కలిసి రోజంతా పార్టీలో మునిగిపోయింది.