సెలబ్రిటీల చుట్టూ ఎప్పుడూ బాడీగార్డులను చూస్తూ ఉంటాము. దానికి కారణం అభిమానుల అత్యుత్సాహం. అభిమానులు ఎప్పుడు, ఎక్కడ, ఎలా రియాక్ట్ అవుతారో ఊహించడం చాలా కష్టం. కొంత మంది సెల్ఫీల కోసం మీద మీద పడి పోతుంటే, మరి కొంత మంది చిరాకు తెప్పించే పనులు చేస్తూ ఉంటారు. పైగా వారికి భద్రత పరంగా కూడా సమస్యలు ఉంటాయి. అందుకే టాప్ సెలబ్రిటీలు అంతా కోట్లల్లో జీతం ఇచ్చి బాడీగార్డులను నియమించుకుంటున్నారు. ఇటీవల కాలంలో అమితాబచ్చన్, షారుక్ ఖాన్ వంటి సెలబ్రిటీల బాడీగార్డులు జీతం విషయం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ బాడీ గార్డ్ సాలరీ ఎంతో బయటకు వచ్చింది.
అమీర్ ఖాన్ బాడీగార్డ్ శాలరీ పెద్ద పెద్ద కంపెనీల సీఈఓ ల కన్నా ఎక్కువగా ఉండటం అందరినీ నోరెళ్ళ బెట్టేలా చేస్తోంది. అమీర్ ఖాన్ బాడీ గార్డ్ పేరు యువరాజ్ ఘోర్ పాడే. ఇప్పుడు అమీర్ ఖాన్వెన్నంటే ఉంటారు. యువరాజ్ పదహారేళ్ళ వయసులోనే స్కూల్ మానేసి ఓ సెలెబ్రిటీ సెక్యూరిటీ ఏజెన్సీ లో చేరాడు. అంతవరకూ వరకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసి జీవితాన్ని గడిపేవారు.
9 ఏళ్ల క్రితం సెక్యూరిటీ ఏజెన్సీలో చేరిన యువరాజ్ ఆ తర్వాత అమీర్ ఖాన్ వ్యక్తిగత బాడీ గార్డ్ గా ఉద్యోగం సంపాదించగలిగాడు. ఓ నివేదిక ప్రకారం యువరాజ్ కు కు సంవత్సరానికి రెండు కోట్ల రూపాయల శాలరీ ఇస్తున్నాడు అమీర్ ఖాన్. బాలీవుడ్ లో సెలబ్రిటీల బాడీగార్డులు ఇలా కోట్ల జీతం అందుకోవడం ఇటీవల కాలంలో ఎక్కువగా చర్చకు వస్తోంది. ఒకరికంటే ఒకరు తమ బాడీ గార్డ్ లకు ఎక్కువగా శాలరీ చెల్లించటం విశేషమే మరి.