జమ్ము కశ్మీర్ లో హిందువులను లక్ష్యంగా చేసుకుని ఇటీవల ఉగ్రదాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయంపై ఉన్నత స్థాయి సమావేశాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిర్వహించారు.
శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే హాజరయ్యారు.
వీరితో పాటు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా, జమ్ము కశ్మీర్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఆర్పీఎఫ్ డీజీ కులదీప్ సింగ్, జమ్ము కశ్మీర్ డీజీపీ దిల్ బాగ్ సింగ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ప్రధానంగా లోయలో భద్రతా పరిస్థితులపై అధికారులతో కలిసి ఆయన సమీక్షించారు. దీంతో పాటు లోయలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆయన సమీక్ష చేపట్టారు.