బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత అమిత్ షా మరింత దూకుడు పెంచారు. బీజేపీ అధ్యక్ష పదవిలో లేకపోయినా అమిత్ షా కనుసన్నల్లోనే వ్యవస్థ మొత్తం నడుస్తోందని రాజకీయ వర్గాల టాక్. అధ్యక్షుడిగా జెపి నడ్డా ఉన్నా ఆయన పాత్ర నామమాత్రమే.
చివరికి ఎవరు ఏ సమస్య చెప్పుకున్నా వెళ్లి అమిత్ షా ను కలవండని చెబుతున్నారట. కెసిఆర్ మోడీని కలిసిన సందర్భంలోనూ మోడీ, కెసిఆర్ కు ఇదే మాట చెప్పారట. జగన్ మోడీ ని కలిసినా… అమిత్ షా దర్శనం కోసం రోజుల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆర్ఎస్ఎస్ కూడా అమిత్ షాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందట. ఇప్పుడు బీజేపీలో అమిత్ షా చెప్పిందే వేదం. షాను ప్రసన్నం చేసుకుంటే అన్ని పనులు జరిగిపోతాయి అన్న తీరుగా పరిస్థితి ఉందని చర్చించు కుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న చర్చ కూడా ఇదే. అమిత్ షా ఫిక్స్ అయ్యాడు…రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు కష్ట కాలం మొదలైందని మాట్లాడుకుంటున్నారు.
తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణలో అధికారం కోసం బీజేపీ తహతహలాడుతోంది…సమయం కోసం వెయిట్ చేస్తోంది….సౌత్ లో అడుగు పెట్టలనుకుంటున్న బీజేపీకి తెలంగాణ మొదటి టార్గెట్. కాంగ్రెస్ ఇప్పటికే అంపశయ్య మీద ఉంది. టీఆర్ఎస్ ను కొట్టాలంటే ఎలా అనే ప్లాన్ లో ఉన్నారు షా. ప్రభుత్వ పెద్దలపై ఉన్న కేసుల మీద దృష్టి పెట్టినట్టుగా గుస గుసలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు బీజేపీ అధినాయకత్వం టీఆరెఎస్ కు పూర్తి సహకారం అందించింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తెలంగాణలో బీజేపీకి అధికారం కావాలి. మొన్న కెసిఆర్ కలిసి ముందుకు వెళ్దాం అని అమిత్ షా కు చెప్పినా వినలేదట. మరో ప్రయోగంగా కేటీఆర్ ను ఢిల్లీకి పంపించారని టాక్. అందులో భాగంగా రాజ్ నాథ్ సింగ్ , అమిత్ షా, మరికొందరు మంత్రులను కలిశారు కేటీఆర్.
కేటీఆర్ , అమిత్ షా భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చాయని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఏం చెప్పినా అమిత్ షా వినట్లేదని ప్రచారం నడుస్తోంది.
ఇక ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి బీజేపీకి కొంత భిన్నంగా ఉంది. ఏపిలో అధికారం బీజేపీకి అంత ఈజీ కాదు. అయినా ఏ అవకాశాన్నీ బీజేపీ వదులుకోవట్లేదు. చంద్రబాబు కూడా బీజేపీకి దగ్గరౌతున్నారు. జగన్ ఇప్పటికే అక్రమ ఆస్తుల కేసులో పీకల్లోతు కూరుకుపోయారు. జగన్- షా ను కలవడానికి విశ్వ ప్రయత్నం చేసి చివరి ప్రయత్నంలో కలిశారు. అయినా అమిత్ షా గుర్రుగానే ఉన్నారట. కెసిఆర్ తో జగన్ ఎక్కువ సన్నిహితంగా ఉండడం, పోలవరం ప్రాజెక్ట్ మేఘాకి అప్పగించడం… అమిత్ షా కోపానికి కారణంగా తెలుస్తోంది. ఇప్పుడు సీబీఐ కోర్ట్ కూడా జగన్ కు షాక్ ఇచ్చింది. కేసుల విషయంలో కాపాడమని జగన్ వేడుకున్నా అమిత్ షా స్పందించలేదని టాక్. షా ఆట మొదలు పెట్టేసారు, మరి ఎవరి పరిస్థితి ఏంటో త్వరలోనే తెలుస్తుంది.