కేసీఆర్ సర్కార్ టార్గెట్ గా తెలంగాణ గడ్డపై అడుగుపెట్టారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కొన్నాళ్లుగా కేంద్రంపై యుద్ధం అని తిరుగుతున్న కేసీఆర్ కు షా.. స్ట్రాంగ్ కౌంటర్సే ఇస్తారని చూస్తున్నారు. ముందుగా.. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షాకు రాష్ట్ర బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు.
బేగంపేట నుంచి రామాంతాపూర్ ఫోరెన్సిక్ ల్యాబ్(సీఎఫ్‌ఎస్‌ఎల్)కు వెళ్లారు షా. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అవి పూర్తవ్వగానే రోడ్డు మార్గంలో శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్ కు వెళ్తారు. అక్కడ బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరుగుతుంది. పార్టీ నేతలకు భవిష్యత్ కార్యాచరణపై షా దిశానిర్దేశం చేయనున్నారు.
సాయంత్రం 6 గంటలకు హోటల్ నుంచి తుక్కుగూడ వెళ్తారు షా. రాత్రి 8 గంటల వరకు బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రి 8.30 గంటల తర్వాత శంషాబాద్ నుంచి ఢిల్లీ తిరుగు పయనం అవుతారు.
రెండో ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా తుక్కుగూడలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా చేయబోయే ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేసీఆర్ కొన్నాళ్లుగా కేంద్రంపై యుద్ధం చేస్తుండగా.. షా మాటకు మాట సమాధానం చెప్తారని చూస్తున్నారు.