కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో మరోసారి అయన ఎయిమ్స్‌లో చేరారు. శ్వాస సంబంధిత సమస్యతో అమిత్‌షా బాధపడుతున్నట్టు తెలిసింది. వీవీఐపీలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీఎస్ టవర్‌లో ఆయన చికిత్స పొందుతున్నారు. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా ఆధ్వర్యంలోని నిపుణుల బృందం ఆయన పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ప్రస్తుతం అమిత్‌షా పరిస్థితి నిలకడగానే ఉందని ఎయిమ్స్ తెలిపిది.
ఆగస్టు 2న కరోనా వైరస్ బారినపడిన్ అమిత్‌షా.. వైద్యుల సూచన మేరకు గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. ఆగస్టు 14న డిశ్చార్జ్ అయ్యి హోంఐసోలేషన్‌లో ఉండగా మళ్లీ అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో నాలుగు రోజులకే తిరిగి ఎయిమ్స్‌లో చేరారు. చికిత్స అనంతరం ఆగస్టు 31న డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా మళ్లీ ఆస్పత్రిలో చేరడం ఆందోళన కలిగిస్తోంది.