అయోధ్యలో రామ మందిరానికి భూమిపూజ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయులకు ఇది మరుపురాని రోజు అని అభివర్ణించారు. అధ్బుతంగా నిర్మించబోయే రామ మందిరం..ప్రధాని మోదీ బలమైన, నిర్ణయాత్మకమైన నాయకత్వానికి ప్రతీకగా చెప్పుకొచ్చారు . భారతదేశ సంస్కృతి, విలువలను కాపాడేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.
కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన కారణంగా అమిత్‌షా ప్రస్తుతం గుర్గావ్‌లోని ఓ ఆస్పత్రిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు.