2002లో గుజరాత్ అల్లర్లకు ప్రధాన కారణం గోద్రా రైలు దహనమేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం తెలిపారు. ఆ ప్రమాదంలో 59 మంది చనిపోయారని ఆయన చెప్పారు. 16 రోజుల వయసు ఉన్న చిన్నారి తన తల్లి ఒడిలో ఉండగా కొందరు దుండగులు ఆమెకు నిప్పంటించారని పేర్కొన్నారు.
వారి దహన సంస్కారాలను తన చేతుల మీదుగా నిర్వహించానని గుర్తు చేసుకుని వాపోయారు. ఈ ఘటనల వల్లే గోద్రా అల్లర్లు జరిగాయని వివరించారు. గోద్రా అనంతర అల్లర్లు రాజకీయంగా ప్రేరేపితంగా ఆయన అన్నారు. రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలను చివరికి అల్లర్లుగా మార్చారని చెప్పుకొచ్చారు.
‘అల్లర్ల అనంతరం మృతదేహాలను సివిల్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ నుంచి అంబులెన్స్‌లల్లో వాటిని మృతుల కుటుంబ సభ్యులు తీసుకు వెళ్లారు. ఆసమయంలో నేను ఆస్పత్రిలోనే ఉన్నాను’అని చెప్పారు.
‘గుజరాత్ బంద్ ప్రకటించినప్పుడు అప్పటి తమ ప్రభుత్వం ఆలస్యం చేయలేదు. వెంటనే ఆర్మీని తమ ప్రభుత్వం రంగంలోకి దించాము. అక్కడికి చేరుకోవడానికి సైన్యానికి కొంత సమయం పట్టిందన్నారు. ప్రభుత్వం వెంటనే తీసుకున్ననిర్ణయంపై కోర్టు కూడా తమ ప్రభుత్వాన్ని అభినందించింది’అని అన్నారు.