పౌరసత్వ చట్టంపై కాంగ్రెస్, దాని కంపెనీ పుకార్లు వ్యాప్తి చేస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి పౌరసత్వమైనా తీసేసే ఒక్క క్లాజ్ చట్టంలో ఉన్నా చూపించాల్సిందిగా సవాల్ చేశారు. దేశంలో శాంతిని భగ్నం చేయవద్దు…ప్రజలను ప్రశాంతంగా ఉండనివ్వండని కోరారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా షిమ్లాలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు, వన్ ర్యాంక్…వన్ పెన్షన్ తో పాటు ఎన్నో మంచి పనులు చేసిందని చెప్పారు.బీజేపీ అధికారంలోకి వచ్చి ఆరేళ్లవుతోంది. ఇప్పటి వరకు మా శత్రువులు కూడా అవినీతి ఆరోపణలు చేయలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి అనేది కామన్ వినిపించేది అని విమర్శించారు.