సింగర్, పంజాబ్ కాంగ్రెస్ నేత సిద్దూ మూసేవాలా కుటుంబాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పరామర్శించనున్నారు. ఆయన శనివారం ఆయన చండీగఢ్ చేరుకుంటారని అధికారులు వెల్లడించారు.
మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సిద్దూ తండ్రిని ఆయన పరామర్శించనున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. సిద్దూ హత్యపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు జరిపించాలని అమిత్ షాను సిద్దూ తండ్రి కోరనున్నారు.
అనంతరం రాష్ట్ర బీజేపీ నేతలతో ఆయన సమావేశం కానున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులతో పాటు పలు అంశాలపై నేతలతో ఆయన చర్చించనున్నారు.
సిద్దూ కుటుంబాన్ని శుక్రవారం పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ పరామర్శించారు. సిద్దూ కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. హత్య కేసులో నిందితులను 15 రోజుల్లో పట్టుకుంటామని హామీ ఇచ్చారు.