ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్ట్-K. పాన్-వరల్డ్ మూవీగా సైన్స్-ఫిక్షన్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా కథేంటి అనేది ఎవ్వరూ చెప్పలేరు. నిజానికి ఈ విషయంలో దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా ఇదే చెబుతున్నాడు. కథగా చెప్పడం చాలా కష్టమని, స్క్రీన్ పై ఎక్స్ పీరియన్స్ చేయాలని చెబుతున్నాడు. ఈ సినిమా కోసం హీరోయిన్ గా దీపిక పదుకోన్, మరో కీలక పాత్ర కోసం అమితాబ్ బచ్చన్ ను తీసుకున్న సంగతి తెలిసిందే.
సింగిల్ లైన్ లో చెప్పలేని ఈ కథలో ఇక క్యారెక్టర్స్ గురించి చెప్పుకోవడం ఇంకా కష్టం. ప్రభాస్ ఎలా కనిపించబోతున్నాడు, అతడి పాత్ర ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇలాంటి సినిమా నుంచి ఓ పాత్ర బయటకొచ్చింది. అదే బిగ్ బి అమితాబ్ బచ్చన్ పాత్ర. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో డాక్టర్ గా, సర్జన్ గా కనిపించబోతున్నారు అమితాబ్.
నిజానికి పాత్రల్ని చాలా సీక్రెట్ గా ఉంచేందుకు ప్రయత్నిస్తోంది యూనిట్. సెట్స్ లో ఎవ్వర్నీ కెమెరాలు, మొబైల్స్ తో అనుమతించడం లేదు. అయినప్పటికీ యూనిట్ కు చెందిన ఓ వ్యక్తి, అమితాబ్ ను క్లిక్ మనిపించాడు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో పెట్టాడు. అందులో సర్జన్ దుస్తుల్లో కనిపిస్తున్నాడు ప్రభాస్. దీంతో బిగ్ బి రోల్ ఏంటనేది జనాలకు తెలిసిపోయింది.
దాదాపు 7 వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది ప్రాజెక్ట్-కె. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రామోజీ ఫిలింసిటీలో ప్రత్యేకంగా సెట్స్ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఆ సెట్ లోనే ప్రభాస్, అమితాబ్ మధ్య కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.