బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన పెద్ద మనసు చాటుకున్నారు. కౌన్‌బనేగా కరోడ్‌పతి 13వ సీజన్‌లో అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి కావాల్సిన అంజెక్షన్ కోసం భారీ విరాళాన్ని ప్రకటించారు. సెలబ్రెటీ రౌండ్ లో భాగంగా శుక్రవారం ఎపిసోడ్‌కు బీటౌన్ సెలబ్రిటీలు ఫరాఖాన్, దీపికా పడుకొనే అతిథులుగా వచ్చారు. ఇద్దరూ బిగ్ బితో గేమ్ ఆడేందుకు కూర్చోగా.. ఈ డబ్బుతో ఏం చేస్తారని అడిగారు అమితాబ్. అప్పుడు వారు చెప్పిన సమాధానం అమితాబ్‌ను కరిగించింది.
తాము ఎంత గెలిచినా.. ఆ మొత్తాన్ని ఆరుదైన వ్యాధి స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA) తో బాధపడుతున్న ఓ చిన్నారి కోసం వినియోగిస్తానని చెప్తూ.. భావోద్వేగానికి గురయ్యారు. చిన్నారికి కావాల్సిన ఇంజెక్షన్ విలువ రూ. 16కోట్లు ఉంటుందని వారు వివరించారు. వారు చెప్పిన కారణాన్ని విని, వారి మంచి మనసుకు అమితాబ్ సైతం చలించిపోయారు. తాను కూడా ఆ చిన్నారి కోసం సాయం చేస్తానని.. కానీ ఎంత అనేది అక్కడ చెప్పనని వెల్లడించారు. ఈ సందర్భంగా చిన్నారి పరిస్థితిని వివరిస్తూ ప్లే చేసిన వీడియో.. కంట తడిపెట్టించేలా ఉంది.
Advertisements