కోలుకున్న మెగాస్టార్.. రాత్రికల్లా షూటింగ్ కొచ్చేస్తారు!

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అస్వస్థులయ్యారు.” థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ ” మూవీ షూటింగ్ సమయంలో అస్వస్థతకు గురికావడంతో ఆయనను వెంటనే స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రాజస్థాన్ లోని జోద్ పూర్ లో జరుగుతోంది. బిగ్ బీకి చికిత్స అందించేందుకు ముంబై నుంచి ప్రత్యేక వైద్య బృందం జోద్ పూర్ చేరుకుంది.

మెడ నొప్పి, వెన్ను నొప్పితో బాధ పడుతున్న అమితాబ్ ఇటీవల ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం కూడా పలు ట్వీట్లు చేసిన ఆయన హఠాత్తుగా అస్వస్థతకు గురి కావడంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అమితాబ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. కాగా.. అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం కుదుటపడిందని.. ఆయన క్రమంగా కోలుకుంటున్నారని.. మంగళవారం రాత్రికల్లా ‘థగ్స్ ఆఫ్ హిందుస్థానీ’ మూవీ షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉందని వైద్యులు ప్రకటించారు.