బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ సడెన్ గా ఓ షోలో కంటతడి పెట్టుకున్నారు. అభిషేక్ ఇచ్చిన సర్ ప్రైజ్ కి అమితాబ్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. మంగళ వారం అమితాబ్ బచ్చన్ 80వ బర్త్ డే. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, ఆయన అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.
కాగా బిగ్ బీ కన్ బనేగ కరోడ్ పతి షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ షో నిర్వాహకులు అమితాబ్ కి తెలియకుండా సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు. బిగ్ బీ భార్య జయ బచ్చన్, హీరో అభిషేక్ బచ్చన్, షోలో సడెన్ ఎంట్రీ ఇచ్చారు. షో జరుగుతుండగా ఒక్కసారిగా సైరన్ మోగడం.. అదేంటి షో అయిపోయిందా? అని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్న తరుణంలో అభిషేక్ సడెన్ ఎంట్రీతో అమితాబ్ ని సర్ ప్రైజ్ చేశారు.
అభిషేక్ రాకతో అమితాబ్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. కంటతడి పెట్టుకున్నారు. అనంతరం తండ్రిని హాట్ సీట్‌లో కూర్చోబెట్టి, హోస్ట్ సీట్‌లో తాను కూర్చోని బిగ్‌బీతో ముచ్చటించారు అభిషేక్. ఈ సందర్భంగా బిగ్‌బీ.. అభిషేక్‌కు సంబంధించిన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
అయితే ఇందుకు సంబంధించిన వీడియోని అభిషేక్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీని వెనుక చాలా ప్లాన్, ఎన్నో రిహార్సల్, హార్డ్ వర్క్ ఉంది. చాలా సీక్రెట్ గా చేశాం. ఇది సరిగ్గా చేయడానికి ఎంతో కష్టపడ్డాం. నాన్న 80వ పుట్టిన రోజును ఆయన ఎంతో ఇష్టపడే వర్క్ ప్లేస్‌లో జరపడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ షోను చాలా ప్రత్యేకంగా చేసేందుకు నాకు సహాయం చేసిన సోనీ టీవీ, కౌన్ బనేగా కరోడ్‌పతి టీమ్ కి నా స్పెషల్ థ్యాంక్స్ అంటూ అభిషేక్ తెలిపారు.