చలికాలం వచ్చిందంటే చాలు మనలో చాలా మంది గజ గజ వణుకుతు నిండుగా రగ్గు కప్పుకొని ఇంట్లో నుంచి బయటకు కదలం. కానీ 77 సంవత్సరాల అమితాబ్ బచ్చన్ గడ్డ కట్టుకుపోయే చలిలో (మైనస్ త్రీ డిగ్రీస్) షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అయన్ ముఖర్జీ దర్శకత్వంలో నిర్మిస్తున్న బ్రహ్మాస్త్ర సినిమా షూటింగ్ ఇప్పుడు మనాలీలో జరుగుతుంది. షూటింగ్ సెట్ లో తాను దిగిన ఫోటోను అమితాబ్ బచ్చన్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో రణ్‌బీర్ కపూర్ కూడా కనిపిస్తున్నారు. రణబీర్ కపూర్, అలియా భట్ హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, మౌని రాయ్, డింపుల్ కపాడియా, అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కరన్ జోహర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ వచ్చే సంవత్సరం విడుదల కానుంది.