బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు, 80 ఏళ్ల వయసులోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటూ తనదైన శైలిలో డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తూ సినీ అభిమానులను అలరిస్తున్నారు. అలాగే, సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులను పలకరిస్తుంటారు.
తాజాగా బిగ్ బీ పెట్టిన పోస్టుపై కొందరు నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోల్స్ చేశారు. ముసలోడు.. అంటూ అమర్యాదగా నోటికొచ్చినట్లు ఆయన ఫేస్‌బుక్ వాల్‌పై కామెంట్లు చేశారు. అయితే అమితాబ్ మాత్రం ఓపికగా సమాధానం చెప్పడమే కాకుండా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
అసలు విషయమేమిటంటే.. రోజూలాగే ఆదివారం ఉదయం కూడా బిగ్‌బీ తన ఫేస్‌బుక్‌లో గుడ్ మార్నింగ్ పోస్ట్ చేశారు. కాకపోతే అది కాస్త ఆలస్యం అయ్యింది. ఉదయం 11.26కి ఆయన గుడ్ మార్నింగ్ పోస్ట్ పెట్టారు. దీంతో పలువురు నెటిజన్లు 11.30 కు గుడ్ మార్నింగ్ ఏంటి..? ఎర్లీ మార్నింగ్ అనుకుంటున్నారా..? అని కామెంట్స్ పెట్టారు.
అయితే, బిగ్ బీ ఓపికగ్గా.. ‘క్షమించాలి.. మిమ్మల్ని డిస్టర్బ్ చేసి ఉంటే .. రాత్రంతా షూటింగ్‌లో ఉండి ఉదయాన్నే వచ్చి పడుకున్నాను.. ఇప్పుడే లేచాను .. నేను లేచిన నిమిషం నాకు గుడ్ మార్నింగే కదా.. అందుకే అందరిని పలకరించాను’ చెప్పుకొచ్చారు. ఇక మరో నెటిజన్ అయితే ‘ఇది మధ్యాహ్నం ముసలోడా’ అంటూ దురుసుగా కామెంట్ చేశాడు.
దీనికి అమితాబ్ సమాధానమిస్తూ.. ‘మీరు చాలా కాలం బతకాలని ప్రార్థిస్తున్నాను.. అయితే మిమ్మల్ని ఎవరూ ముసలోడు అని పిలిచి అవమానించకూడదని కోరుకుంటున్నా’ అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో పెద్దవారిని ఎలా గౌరవించాలో చెంప పెట్టుమని చెప్పారు. ఇక అమితాబ్‌కు పలువురు సపోర్ట్ ఇస్తున్నారు. ‘ఆయన ఎక్స్ పీరియన్స్ అంత వయస్సు ఉండదు నీకు.. ఆయనను అవమానిస్తావా..?’ అంటూ నెటిజన్స్ సదరు వ్యక్తిని విమర్శిస్తున్నారు.