బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు. ఈ మేరకు ఆయన మంగళవారం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన సన్నిహితులకు, అభిమానులకు ధన్యవాదాలు చెప్పారు. అయితే గాయం కోలుకునేందుకు కాస్త సమయం పడుతుందని తెలిపారు. డాక్టర్ చెప్పిన సూచనలను క్రమం తప్పకుండా పాటిస్తున్నా అన్నారు అమితాబ్.
తనను కలిసేందుకు ఎవరూ రావద్దని, ఆందోళన చెందవద్దని కోరారు. పక్కటెముకలు విరిగిన కారణంగా శ్వాస తీసుకునేందుకు ఇబ్బందిగా ఉందని చెప్పారు. ముంబైలో తన నివాసంలో హోలీ చేసుకున్న అమితాబ్.. అభిమానులకు కూడా శుభాకాంక్షలు తెలిపారు.
T 4575 – gratitude and love ever .. for your concern and wishes
— Amitabh Bachchan (@SrBachchan) March 7, 2023
T 4576 – your prayers are the cure
— Amitabh Bachchan (@SrBachchan) March 7, 2023
కాగా హైదరాబాద్ లో ‘ప్రాజెక్ట్ కే’ చిత్రీకరణలో భాగంగా యాక్షన్ సీన్స్ చేస్తున్న క్రమంలో సూపర్ స్టార్ అమితాబ్ గాయపడ్డారు. వెంటనే ఆయన్ని మూవీ టీమ్ స్థానిక ఏఐజీ ఆస్పత్రికి తరలించింది. అమితాబ్ కి సిటీ స్కాన్ చేయగా.. పక్కటెముకలు విరిగినట్లు రిపోర్ట్ లో వచ్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం ఆయన ముంబై నివాసానికి చేరుకున్నారు. డాక్టర్ల సూచన మేరకు ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు.
ఇక ప్రాజెక్ట్ కే విషయానికి వస్తే.. వైజయంతి మూవీస్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ కు.. నాగ్ అశ్విన్ డైరెక్షన్ వహిస్తున్నారు. ఇక ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటు, బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె, అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. కాగా ఈ సినిమా 2024 సంక్రాంతికి జనవరి 12 థియేటర్లలో సందడి చేయనుంది.