బాలీవుడ్ బిగ్ బి కుటుంబాన్ని కరోనా మహమ్మారి కుదిపేసిన సంగతి తెలిసిందే. అమితాబ్ తో సహా అభిషేక్, ఐశ్వర్య రాయ్, కూతురు ఆరాద్యలకు కూడా కరోనా వైరస్ సోకింది. ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. ముఖ్యంగా అమితాబ్ విషయంలోనే అందరూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన వయసు రీత్యా.. ఈ మహమ్మారిని ఎదుర్కొని.. క్షేమంగా కోలుకొని బయటికి రావాలని అందరూ ఎంతగానో ప్రార్థించారు. అభిమానుల ప్రార్థనలతో అమితాబ్ కోలుకున్నారు. కానీ ఆయన కొడుకుని మాత్రం అంత తొందరగా వదల్లేదు. ఎట్టకేలకు అభిషేక్ కరోనా ను జయించి ఇంటికి వచ్చారు. ఇదే విషయమై చెప్తూ అమితాబ్ ట్వీట్ చేశారు.అభిషేక్ బచ్చన్‌కు ఈ రోజు టెస్ట్‌లో నెగిటివ్ వచ్చింది. హాస్పటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇంటికి వచ్చేస్తున్నారు. గాడ్ ఈజ్ గ్రేట్. మా కోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్క అభిమానికి, శ్రేయోభిలాషికి ధన్యవాదాలు..అని అమితాబ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
T 3620 – Abhishek tests negative for CoviD .. discharged from Hospital .. on his way home ..
GOD IS GREAT .. 🙏🙏🙏🙏
.. thank you Ef and well wishers for your PRAYERS .. pic.twitter.com/aHyBw0SPFH— Amitabh Bachchan (@SrBachchan) August 8, 2020