అప్పట్లో వచ్చే సినిమాలకు సంబంధించి ఎన్నో విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అప్పటి నటులు చేస్తున్న కామెంట్స్ తో ఈ విషయాలకు బాగా హైప్ వస్తుంది. అలాంటి విషయమే ఒకటి ఇప్పుడు జయప్రద ఒక షో లో పంచుకున్నారు. 1984లో బాలీవుడ్ సినిమా అమితాబ్ హీరోగా ‘షరాబి’ అనే సినిమా విడుదల కాగా ఆయన పక్కన జయప్రద నటించారు. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది.
18 పాటలతో వచ్చిన ఈ సినిమా పాటలకు కూడా మంచి స్పందన వచ్చింది. జయప్రద జీటీవీ రియాల్టీ షో ‘స రే గ మ ప లిటిల్ చాంప్స్’లో అతిథిగా హాజరయ్యారు. ఆ సినిమాలోని ముజ్కో నౌలాఖా మంగా దే అనే పాట షూటింగ్ సమయంలో అమితాబ్ బచ్చన్ కు గాయం అయింది. పాట షూటింగ్‌లో ఉన్నప్పుడు దీపావళి టపాసుల కారణంగా అమితాబ్ చేతికి గాయం అయిందని… అది ఇప్పటికీ తనకు గుర్తుందని అన్నారు.
పాటలోని ఒక భాగంలో అమితాబ్ ఘుంగ్రూ ప్లే చేస్తున్నారని… అయితే అతను నొప్పితో ఉన్నందున, అప్పటికే గాయపడినందున, సన్నివేశం చిత్రీకరణలో అతని చేతి నుంచి రక్తస్రావం అయ్యేదని తెలిపారు. అయినా సరే వెనక్కు తగ్గకుండా తన చేతులను ఐస్ బాక్స్‌లో ఉంచి సన్నివేశం షూటింగ్‌ను పూర్తి చేశారని వివరించారు. ఆయన అంకితభావం, దూరదృష్టి ప్రతి కళాకారుడు నేర్చుకునేందుకు ఒక ఉదాహరణగా నిలిచిందని కొనియాడారు.