కులం మతం అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే అది జెండా పండుగ ఒక్కటే. బుధవారం గణతంత్ర దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సామాన్యులు, రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలిపారు.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా సోషల్ మీడియా వేదికగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే అందరిలా కాకుండా కాస్త వినూత్నంగా విష్ చేశారు. సాధారణంగా గణతంత్ర దినోత్సవం రోజున ముచ్చట గొలిపే మూడు రంగుల మువ్వన్నెల జెండాను ఎగరవేసి జెండా వందనం చేస్తాం. కానీ.. అమితాబ్ మాత్రం జాతీయ పతాకంలోని మూడు రంగుల గడ్డంతో విభిన్నంగా శుభాకాంక్షలు చెప్పారు.
మూడు రంగులతో ఉన్న గడ్డం ఫొటోను తన ఇన్ స్టాగ్రాం వేదికగా పోస్ట్ చేశారు అమితాబ్ బచ్చన్. అంతేకాకుండా ఇలాంటి గణతంత్ర దినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్ పై నెటిజన్లతోపాటు సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు.
శుభాకాంక్షలు ఎంతో గొప్పగా చెప్పారు అని పులువురు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు నవ్వుతున్న ఎమోజీస్ ను పెడుతున్నారు. ఇంకొందరు విమర్శిస్తూ కామెంట్ పెట్టారు. అలాగే ఈ పోస్ట్ ను కొన్ని గంటల్లోనే 1.9 లక్షల మందికిపైగా లైక్ చేశారు. వినూత్న వేషధారణలో కనిపించి అభిమానులకు ఫుల్ జోష్ ను అందించారు అమితాబ్.