గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన కేంద్రమంత్రి, బీజేపీ కీలక నేత అమిత్ షా రోడ్ షో ముగిసింది. చార్మినార్ భాగ్యలక్ష్మి గుడిలో ప్రత్యేక పూజల అనంతరం వారాసీగూడ నుండి రోడ్ షో ప్రారంభించారు. సీతాఫల్ మండి వరకు రోడ్ షో జరగాల్సి ఉన్నా… అనుకున్న సమయం కన్నా ఆలస్యం అవుతుండటంతో అమిత్ షా రోడ్ షోను మధ్యలోనే ముగించినట్లు తెలుస్తోంది.
అమిత్ షా రోడ్ షోకు జనం భారీగా తరలివచ్చారు. రోడ్ షో నుండి నేరుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం వెళ్లిన అమిత్ షా అక్కడ స్థానిక మీడియాతో ప్రసంగించనున్నారు.