పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ ఛన్నీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శలతో విరుచుకు పడ్డారు. పంజాబ్ లో ప్రధాన మంత్రి పర్యటనలో జరిగిన భద్రతా లోపాన్ని ఎత్తి చూపుతు తీవ్రంగా విమర్శించారు. చన్నీ సమర్థతనీయతకు సంబంధించి ప్రశ్నలు సంధించారు.
లుథియానాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ‘ దేశ ప్రధానికి పంజాబ్ పర్యటనలో సురక్షితమైన మార్గాన్ని చన్నీ చూపించలేకపోయారు. అలాంటి వ్యక్తి పంజాబ్ కు రక్షణ కల్పిస్తారా” అని అన్నారు.
పంజాబ్ లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పాటు అవుతుందని ఛన్నీ సాహిబ్ కలలు కంటున్నారు. దేశ ప్రధానికి రక్షణ కల్పించలేకపోయిన ముఖ్యమంత్రి ఆయన. అలాంటిది పంజాబ్ కు ఎలా రక్షణ కల్పిస్తారు అని అన్నారు.
‘ బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలో డ్రగ్స్ రవాణాను అరికడతాం. అందుకోసం రాష్ట్రంలో నాలుగు ప్రధాన నగరాల్లో నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో కార్యాలయాలను ఏర్పాటు చేస్తాము. డ్రగ్స్ అక్రమరవాణాను అరికట్టేందుకు ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేస్తాము” అని హామీ ఇచ్చారు.