రామోజీ ఫిల్మ్ సిటీలో భీమ్లా నాయక్ చివరి షెడ్యూల్ షూటింగ్ ను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు పవన్ కళ్యాణ్. ఆ పక్కనే నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె కోసం ప్రభాస్, అమితాబ్ బచ్చన్ సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది. ఈ విషయం పవన్ తెలుసుకున్నాడు. అమితాబ్ బచ్చన్‌ను రిసీవ్ చేసుకోవడానికి పవన్ స్వయంగా పవన్ కళ్యాణ్ వెళ్లారట. అమితాబ్ కూడా పవన్, ప్రభాస్ లను బాగా రిసీవ్ చేసుకున్నారని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్, ప్రభాస్, బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో లంచ్ కూడా చేశారట. అయితే ముగ్గురు పెద్ద స్టార్స్ కలిసి కబుర్లు చెప్పుకోవడం చాలా గొప్ప దృశ్యమని చూసిన వారు అంటున్నారు. ఇక భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25 విడుదలకు సిద్ధంగా ఉన్నందున పవన్ అమితాబ్‌కు వీడ్కోలు చెప్పి షూటింగ్ లో పాల్గొన్నాడట.
అయితే ఈ ముగ్గురూ కలిసి సెట్స్‌లో తిరుగుతున్న ఫోటోలు ఇంకా విడుదల కాలేదు. పవన్ కళ్యాణ్ అమితాబ్ బచ్చన్ వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందు అనేక వేదికలపై బహిరంగంగా ఆ విషయం చెప్పుకొచ్చాడు.
ఇక ప్రాజెక్ట్ కె లో దీపికా పదుకొనే కూడానటిస్తుంది. దీపిక ఇంకా షూట్‌లో జాయిన్ కాలేదు. 400 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈసినిమా ఊహాత్మక మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతుంది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్విని దత్ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు.