గందరగోళానికి ముగింపు వచ్చింది. భీమ్లా నాయక్ తో పోటీ నుంచి తప్పుకున్నాడు శర్వానంద్. కిషోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ సినిమాను ఫిబ్రవరి 25న రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్.
కానీ ఇప్పుడు మార్చి 4న రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యారు. భీమ్లా నాయక్ ను దృష్టిలో ఉంచుకుని సినిమా విడుదలను ఒక వారం పాటు వాయిదా వేశారు మేకర్స్.
మలయాళ యాక్షన్ డ్రామా అయ్యప్పనుమ్ కోషియమ్‌కి రీమేక్‌గా తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ సినిమా తెరకెక్కుతుంది. తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా మార్పులు చేసి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
ఇక యు/ఎ తో సెన్సార్ ను కూడా పూర్తి చేసుకుంది భీమ్లా నాయక్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.